తెలంగాణలో రేపు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు.శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ వంటి పలువురు నేతలు మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయి మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం.







