సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అంటే చాల ప్రొడక్షన్ కంపెనీ ల చేతిలో ఉంది కానీ ఒకప్పుడు మాత్రం దర్శకుల మీదనే ఎక్కువగా నడిచేది.ఆయనను కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా పిలిచే వారు.
క్రియేటివ్ హెడ్ కాబట్టి అయన ఏది చెప్తే అదే చేసేవారు.కానీ దర్శకుడి కి వ్యతిరేఖంగా ఒక హీరో ఏదైనా చేస్తే అది సంచలనమే.
ఇక ఒక దర్శకుడు ఒక హీరో మధ్య ఒక గొడవ ఎంత పెద్ద విషయం గా మారిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.దర్శకుడు దాసరి నారాయణ రావు( Dasari Narayana Rao ) అప్పట్లో కొన్నేళ్ల పాటు తన హవాను కొనసాగించారు.
అయన కనుసన్నల్లో చాల పనులు జరిగేవి.అయన రాసిందే రాత అన్నట్టుగా కూడా ఉండేది.

అయితే తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు వారు మాత్రమే కాదు ఎవరైనా భాగం కావలి అన్నది దాసరి యొక్క అభిప్రాయం.అందుకే రజిని కాంత్, కమల్ హాసన్ వంటి వారిని ఇక్కడ బాగా ప్రోత్సహించారు.అయితే వారికే బాషా తో సమస్య ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా డబ్బింగ్ ఆర్టిస్టులను( Dubbing Artists ) కూడా పెట్టాలని నిర్ణయించుకొని ఒక ఇంటర్వ్యూ కోసం యాడ్ వేయించారు.దాదాపు వంద మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులను తయారు చేస్తే అందులో ఒక నలభై మందికి పైగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నారు.
అంతే కాదు వారికి సినిమా సంఘం లో కూడా ఒక భాగం కల్పించి వారికంటూ నియమాలు, నిబంధనలు పెట్టి వారిని ఇండస్ట్రీ లో భాగం చేసారు.

అయితే తెలుగు సినిమాల్లో పరాయి బాషా హీరోల ఎంట్రీ ని ఎన్టీఆర్( NTR ) ఆమోదించలేదు.అందుకు అని ఆయన దాసరి తో విభేదించారు.మొదటి నుంచి వీరి మధ్య కొన్ని పొరపచ్చాలు ఉన్నాయ్.
అలాగే తెలుగు వారు అంత ఈ విషయం పై పోరాడాలి అని అంటూ పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చాడు.తెలుగు వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తన పోరాటం లో భాగం కావాలని అక్కినేని కి కూడా కబురు పెట్టారు.
వివాదాలకు నేను దూరం అంటూ అయన ఈ విషయం నుంచి తప్పుకున్నారు.కానీ ఎన్టీఆర్ కొంత కాలం దీనిపై కోపంగా ఉన్నారు.కొన్నాళ్ళకు దాసరి ఎన్టీఆర్ ని కలిసి అందరు మనవాళ్లే మనలో మనకు ఎందుకు గొడవలు అంటూ అనడం తో ఈ విషయం అక్కడితో ముగిసిపోయింది.