టీ-20 ప్రపంచకప్ లో ఆ నలుగురు ఫామ్ పై ఆందోళన.. బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారా..!

టీ-20 ప్రపంచకప్ లో ఆ నలుగురు ఫామ్ పై ఆందోళన.బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారా.! టీ-20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన 15 మందిలో నలుగురు ఆటగాళ్లు పేలన ఫామ్ బీసీసీఐని కలవర పెడుతోంది.ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా,  రాహుల్ చహర్ లు… ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమయ్యారు.

 Concern Over Those Four Forms In The T20 World Cup Bcci , Selectors Have Reconsi-TeluguStop.com

యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో దశలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఇషాన్ కిషన్ (11, 14, 9 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (3, 5, 8 పురుగులు), రాహుల్ చహర్ (ఒక్క వికెట్) దారుణమైన గణాంకాలను నమోదు చేయగా… చాలాకలంగా ఫిట్ నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నారు.

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ లో ఒక్క బంతి కూడా బౌల్ చేయకపోవడంతో పాటు బ్యాటింగ్ లో 8 ఇన్నింగ్స్ లో 7.85 సగటున పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు.దీంతో ఈ నలుగురు ఆటగాళ్ల ఎంపిక పై బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.

ఫామ్ లో లేని వీరిని తప్పించి ఐపీఎల్ లో రాణిస్తున్న దేవ్ దత్ పడిక్కల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్,  శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్,  చాహల్ లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం.కాగా ఈ విషయంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందిస్తూ.

ప్రస్తుతం ఆ నలుగురు ఫామ్ ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.మిగతా  ఐపీఎల్ మ్యాచ్లు ముగియడానికి మరో 12 రోజుల సమయం ఉన్నందున వాళ్లు తిరిగి ఫామ్ లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube