తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో అధికారులు ఆందోళన పడుతున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం ఇప్పటికే ఆన్ లైన్ లో అధికారులు దరఖాస్తు చేసుకున్నారు.కానీ పోస్టల్ బ్యాలెట్ రాలేదని వాపోతున్నారు.
ఎన్నికల విధుల్లో తాము కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నారు.అయితే హైదరాబాద్ లోని చార్మినార్ నియోజకవర్గంలో కొందరు అధికారులకు పోస్టల్ బ్యాలెట్ రాలేదని సమాచారం.