బోగస్ ఓట్లపై ఫిర్యాదులు వచ్చాయని ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.అయితే కేవలం తిరుపతి అర్బన్ నుంచి మాత్రమే ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
దాదాపు 663 పేర్లు బోగస్ ఓట్లని టీడీపీ అధినేత చంద్రబాబు కంప్లైంట్ చేశారని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ తెలిపారు.ఈ నేపథ్యంలో 500 పేర్లపై ఇప్పటికే విచారణ చేసి ఈసీకి నివేదిక పంపామని పేర్కొన్నారు.
అడ్రస్ లు సరిగా ఫీడ్ చేయలేదని గుర్తించి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.అడ్రస్ లు సరిగా ఫీడ్ చేయలేదని గుర్తించి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఫేక్ సర్టిఫికేట్లతో ఓటు హక్కు వినియోగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.







