శ్రీకాళహస్తి టౌన్ సిఐ అంజు యాదవ్ ( Anju Yadav )వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.జనసేన స్థానిక నేత కొట్టే సాయిపై దురుసుగా ప్రవర్తించడం, ఈ వ్యవహారం జనసేన సీరియస్ గా తీసుకోవడం, స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) దీనిపై స్పందించి తిరుపతికి వచ్చి మరీ ఎస్పీకి సీఐపై ఫిర్యాదు చేశారు.
కార్యకర్తలు తప్పు చేయకపోయినా సిఐ దాడి చేశారని, వెంటనే సిఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.దీనిపై స్పందించిన ఎస్పీ ఆమెపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి తప్పని తెలిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక్కడితో ఈ వ్యవహారం ముగిసింది అనుకుంటే, ఇప్పుడు మరో మలుపు తిరిగింది.సిఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘం నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బిసి మహిళ అయిన అంజూ యాదవ్ జోలికొస్తే పవన్ కళ్యాణ్ తాట తీస్తామంటూ ఆయన భాషలోనే హెచ్చరికలు చేశారు.అంతేకాదు కానిస్టేబుల్ కొడుకుని పదేపదే చెప్పే పవన్ కష్టపడి సిఐ స్థాయికి ఎదిగిన అంజు యాదవ్ పై వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని, యాదవ సంఘం నాయకులు మండిపడుతున్నారు.
సీఐ అంజు యాదవ్ ఏ తప్పు చేయలేదని, రోడ్డుపై ధర్నా చేయడం వల్ల స్థానికులకు ఇబ్బంది కలగడంతో ఆమె నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లారని వారు చెబుతున్నారు .ఇది ఇలా ఉంటే ఒక సీఐ స్థాయి అధికారి వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించడం వంటివి పవన్ కళ్యాణ్ స్థాయి వ్యవహారం కాదని కానీ, పవన్ ఈ వ్యవహారంపై స్పందించి ఒక సామాజిక వర్గం ఆగ్రహానికి గురికావాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక్కడ మరో విషయం ప్రస్తావనకు వస్తుంది.

సాధారణంగానే పోలీసులు విధుల్లో భాగంగా దూకుడుగా వ్యవహరించడం సర్వసాధారణం వ్యవహారమైనని, ఈ సందర్భంగా కొంతమంది పై ఈ విధంగా వ్యవహరించడం మామూలేనని అసలు జనసేన కార్యకర్తను( Janasena activist ) కొట్టారంటూ పవన్ ఈ స్థాయిలో ఆగ్రహం ప్రదర్శించి, ఈ విషయాన్ని పెద్దది చేయాల్సిన అవసరం ఏమిటని, అసలు సాయి అని కార్యకర్తను ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే ప్రశ్నను కొంతమంది సేవ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ అదికూడా రావణుడి మాదిరిగా పది తలలు ఏర్పాటు చేసి ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తల మీద కాళ్లు వేసి తొక్కుతూ.

హాడవుడి చేస్తున్న జనసేన కార్యకర్తలను చెదరగొట్టే ప్రక్రియలో భాగంగానే అంజు యాదవ్ కాస్త దురుసుగా ప్రవర్తించారని , ఒక మహిళ అధికారిపై ఈ విధంగా పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు వ్యవహరించడం సరికాదు అంటూ యాదవ సామాజిక వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఆమె డ్యూటీలో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉంటారని, ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా దూకుడుగా ముందుకు వెళుతుంటారని, ఏడాది క్రితం వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ( Biyyapu Madhusudan Reddy )కుమార్తె పవిత్ర ఓ ధర్నా కార్యక్రమంలో పాల్గొనగా ఆమె విషయంలోనూ ఇదేవిధంగా వ్యవహరించారని , పోలీస్ విధుల్లో ఇవన్నీ సాధారణమైన వ్యవహార లేనని, కానీ ఈ విషయంపై పవన్ కళ్యాణ్ వంటి స్థాయి ఉన్న నాయకులు స్పందించి రచ్చ చేయడం సరికాదనే వ్యాఖ్యలు యాదవ సామాజిక వర్గం నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి.