మల్కాజ్గిరి పార్లమెంట్( Malkajgiri Parliament ) నియోజకవర్గంలో తమకు బీజేపీతోనే పోటీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) అన్నారు.పదేళ్ల పాలనలో మోదీ చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే కేసీఆర్ రాష్ట్రంలో ఏం చేశారో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
కేసీఆర్ ఏం చేశారో తాము చెప్తామన్న కేటీఆర్ బీజేపీ నేత ఈటల రాజేందర్ కు( Etela Rajender ) దమ్ముంటే మోదీ మల్కాజ్‌గిరికి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.పదేళ్లు కంటోన్మెంట్ లో భూములు కావాలని అడిగితే పట్టించుకోలేదన్నారు.బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి( BJP ) వేసినట్లేనని తెలిపారు.