తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా,బోనీ కపూర్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘వాలిమై’ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ఇందులో తమిళ స్టార్ హీరో అజిత్ తో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ పోటీ పడిన విషయం మనకు తెలిసిందే.శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ముఖ్యంగా ఇందులో బైక్ స్టంట్లు ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కావడంతో ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేసారు.సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న తన ఫొటోను పంచుకుంటూ “సూపర్ స్టార్‌తో తలపడుతున్నప్పుడు నువ్వు కూడా అంతే బలంగా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ ఫోటో పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు స్పందిస్తూ తమిళ స్టార్ హీరో అజిత్ తో తలపడాలి అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు మలయాళ భాషలలో కూడా డబ్ కానుంది.