చిరంజీవి బాలయ్య పోటీ వల్ల మైత్రీ నిర్మాతలకు అన్ని రూ.కోట్ల నష్టమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తూ ఉండటంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పేరు మారుమ్రోగుతోంది.

 Competetion Between Chiranjeevi And Balakrishna Details Here Goes Viral , Mythri-TeluguStop.com

చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి కేవలం ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానుండటంతో నిర్మాతలకు ఏకంగా 30 కోట్ల రూపాయల నష్టమని తెలుస్తోంది.

వేర్వేరు రోజుల్లో ఈ రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

ఈ సినిమాలు వేర్వేరు రోజుల్లో విడుదలై ఉంటే ఈ మొత్తం అదనంగా ఇస్తామని బయ్యర్లు సూచిస్తున్నారు.అయితే పరువుకు సంబంధించిన పోటీ కాబట్టి చిరంజీవి, బాలయ్యలలో వెనక్కు తగ్గడానికి ఏ హీరో సిద్ధంగా లేరు.

నిర్మాతలకు నష్టం వస్తుందని తెలిసినా హీరోలు మాత్రం పోటీ విషయంలో వెనక్కు తగ్గడానికి ఓకే చెప్పడం లేదు.

Telugu Balakrishna, Chiranjeevi, Mythri Makers, Tollywood-Movie

ఇద్దరు హీరోలు బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు కావడం, ఇద్దరు హీరోల సినిమాలకు 80 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉండటంతో సంక్రాంతి పండుగకు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ఇతర సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాకుండా మైత్రీ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సి ఉంది.తమిళ సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

Telugu Balakrishna, Chiranjeevi, Mythri Makers, Tollywood-Movie

రెండు భారీ సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ నిర్మాతలకు ఊహించని పోటీ వల్ల భారీ షాక్ తగిలింది.సంక్రాంతి సమయానికి ఏదైనా మూవీ షూటింగ్ వల్ల ఆలస్యమైతే మైత్రీ నిర్మాతలకు బెనిఫిట్ కలుగుతుంది.బాలయ్య నిర్ణయాల వల్లే మైత్రీ నిర్మాతలు ఇరకాటంలో పడ్డారని కామెంట్లు వినిపిస్తున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు స్టార్ హీరోల సినిమాలతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube