‘మనీహీస్ట్‌’ మూవీ చూడటానికి ఉద్యోగులకు సెలవు!

ఓ కంపెనీ తాజాగా తమ ఉద్యోగుల కోసం ఓ క్రెజీ ఆఫర్‌ను ప్రకటించింది.

ఇప్పటి వరకు కేవలం పండగలకు, పెళ్లిలకు, వేరే ఏదైనా ఆరోగ్య సంబంధిత సెలవులను ప్రకటించడం మీరు వినుంటారు.

కానీ, ఈ కంపెనీ ప్రకటించిన వినూత్న సెలవుకు చాలా ఆసక్తికరంగా, కొత్తగా ఉంది.తమ ఉద్యోగుల్లో ఉత్సాహాం పెంచడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ వివరాలు తెలుసుకుందాం.అయితే, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అవుతున్న స్పానీష్‌ వెబ్‌ సిరీస్‌ ‘మనీ హిస్ట్‌’ విడుదల అవ్వనున్న సంగతి తెలిసిందే! ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సెప్టెంబర్‌ 3న నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది.అయితే, ఈ మూవీని చూడటానికి తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది ఓ సంస్థ.

Advertisement
Company Offers Holiday To Employees To Watch Money Heist Movie, Netflix, Money H

తాజాగా ఈ మూవీకి సంబంధించిన సీజన్‌ సెట్స్‌ బీటీఎస్‌ ఫోటోలను, టీజర్‌ను నిర్మాతలు ప్రమోషన్‌ కోసం షేర్‌ చేస్తున్నారు.ఈ షో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొత్త సీజన్‌తో సంచలనం సృష్టిస్తోంది.

మూవీ అభిమానులు ఇప్పటికే ప్రత్యేక స్క్రీనింగ్, ఆన్‌లైన్‌ వాచింగ్‌ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నారు.అయితే, జైపూర్‌కు చెందిన సంస్థ తన ఉద్యోగుల కోసం ఓ గుడ్‌న్యూస్‌ తెలిపింది.

ఆ కంపెనీ సీఈఓ వారికి ఊహించని బహుమతిని అందించాడు.‘వెర్వ్‌ లాజిక్‌’ సంస్థ సెప్టెంబర్‌ 3న కంపెనీకి సెలవు ప్రకటించింది.

అందులో విచిత్రమేముంది అనుకోకండి.ఆ రోజు నెట్‌ఫ్లిక్స్, చిల్‌ హాలిడే అని ప్రకటించింది.

Company Offers Holiday To Employees To Watch Money Heist Movie, Netflix, Money H
స్టామినా పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం

ఎందుకంటే మనీహీస్ట్‌ షో ఆ రోజే విడుదల కానుంది.దీనిపై సంస్థ సీఈఓ అభిషేక్‌ జైన్‌ మాట్లాడుతూ.ఈ మూవీపై ఆన్‌లైన్‌ క్రేజ్, మూవీ చూడటానికి వారిలో ఉన్న ఉత్సాహం కారణంగా, కొవిడ్‌ సమయంలో వారి ఉద్యోగులు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ ఆఫర్‌ను వారికి ప్రకటించినట్లు తెలిపారు.

Advertisement

‘ఒక్కోసారి పనికి బ్రేక్‌ తీసుకోవడం కూడా మంచిదే’నని సోషల్‌ మీడియాలో ప్రకటించారు.కంపెనీ అధికారిక మెయిల్‌లో సీఈఓ తప్పుడు సాకులు చెప్పి మాస్‌ బంక్‌లు, ఫోన్‌ నంబర్లు స్వీచ్‌ఆఫ్‌ చేస్తున్నారు.

కొన్నిసార్లు ఈ పని చేయకతప్పదు అని మాకు కూడా దెలుసు.పనిలో ఆసక్తి పెరగటానికి విరామం తప్పదు.గతంలో వర్క్‌ ఫ్రం నిర్వర్తించడంలో అద్భుత స్ఫూర్తి చూపించిన సభ్యులందరికీ వేర్వ్‌ లాజిక్‌ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

కష్ట సమయంలో మాకు అండగా ఉండి బయటపడటానికి మాకు సహాయం చేశారని ఆయన చెప్పారు.మెయిల్‌ చివరలో ‘బెల్లా సియావో, బెల్లా సియావో’అనే థీమ్‌ సాంగ్‌తో ముగించారు.ఇది మనీహీస్ట్‌ మూవీలోని ప్రసిద్ధ ఇటాలియన్‌ నిరసన పాట.సంస్థ సీఈఓ ఓ వార్త పత్రికతో అభిషేక్‌ మాట్లాడుతూ ‘ప్రజలు నిజంగా సరదా సెలవు కోసం ఎదురు చూస్తున్నారు.కొత్త మనీహీస్ట్‌ షో కోసం ఎదురు చూస్తున్నారు.

ఇది నేను విన్నాను.వారు కంపెనీ కోసం నిరంతరం పనిచేస్తున్నందుకు ఇటువంటి క్రేజీ గిఫ్ట్‌ను వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఇది కేవలం ఒక్క రోజు సెలవు కాబట్టి మేం కూడా సరదా సెలవుగా ప్రకటించా’మన్నారు.

తాజా వార్తలు