సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.ఎందుకంటే వాళ్లు చేసే సినిమాల్లో వైవిధ్యమైన కథాంశాలు ఉండడమే కాకుండా ఆ హీరోలు వాళ్ల నటన తో ప్రేక్షకులను ఎప్పుడూ కూడా నిరాశపరచకుండా ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తు ఉంటారు.
ఇక అలాంటి వారిలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూర్య( Surya ) ఒక్కడు.ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ పాత్రనైనా సరే అలవోకగా చేస్తూ ఆ పాత్రకి న్యాయం చేస్తూ ఉంటాడు.
ఇక ఈయన లాంటి నటులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు అందుకే సూర్య చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాడు.
ఇక ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శివ డైరెక్షన్ లో కంగువ( Kanguva ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా మీద రోజురోజుకీ అంచనాలైతే భారీగా పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు మాత్రం సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలిపేలా కనిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు సూర్యలు ఉంటారనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.అందులో ఒకరు విలన్ అవ్వగా, మరొకరు హీరో అనే విషయం తెలుస్తుంది.
ఇక సూర్య ఇంతకుముందు తీసిన 24 సినిమాలో( 24 Movie ) కూడా త్రిపాత్రాభినయం చేశాడు.
అందులో ఒక క్యారెక్టర్ లో విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఇప్పుడు కంగువ సినిమాలో కూడా మళ్లీ అదే రిపీట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో కూడా హీరో విలన్ 2 పాత్రల్ని అతనే పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరో గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
సినిమా కనక పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అయితే సూర్యకి ఎక్కడలేని క్రేజ్ అయితే వస్తుంది…
.