సామాన్యులు పండగ చేసుకొనే న్యూస్... గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ!

అవును, ఇది సామాన్యులు పండగ చేసుకొనే వార్త అని చెప్పుకోవచ్చు.కరోనా తరువాత పెరిగిపోయిన నిత్యవసర వస్తువుల ధరల విషయంలో దేశమంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ ఇలాంటి నిర్ణయాలు ఒకింత ఊరటని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు.

 Common People Celebrate News Subsidy On Gas Cylinder , Common People, Latest N-TeluguStop.com

ఇపుడు తాజాగా ఉజ్వల పథకం కింద కోట్లాది మంది లబ్ధిదారులకు మోదీ ప్రభుత్వం పెద్ద కానుకగా అందించింది.ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని రూ.200 నుండి రూ.300కి పెంచింది.అంటే ఉజ్వల పథకం( PM Ujjwala Yojana ) కింద వచ్చే ప్రజలకు ఇప్పుడు రూ.600 విలువైన గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.దాదాపు 37 రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించడం గమనార్హం.

Telugu Anurag Thakur, Celebrate, Common, Gas Cylinder, Latest, Narendra Modi, Su

కాగా తాజా నిర్ణయం వలన 10 కోట్ల మంది లబ్ధి పొండనున్నారు.గత ఆగస్టు 29న ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించిన సంగతి విదితమే.కాగా దీని ప్రయోజనం దేశంలోని వినియోగదారులందరికీ అందించబడింది.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్( Anurag Thakur ) మాట్లాడుతూ, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని సిలిండర్‌పై రూ.200 నుండి రూ.300కి పెంచిందని చెప్పుకొచ్చారు.

Telugu Anurag Thakur, Celebrate, Common, Gas Cylinder, Latest, Narendra Modi, Su

ప్రధాని మోదీ అధ్యక్షతన( Narendra Modi ) జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి కొత్త సూచనలు చేయాలని కృష్ణా ట్రిబ్యునల్‌ను కేంద్రం కేబినెట్‌ కోరింది.దీంతో కృష్ణా జలాల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్బంగా పసుపు ఎగుమతులను కూడా రూ.8000 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో బోర్డును ఏర్పాటు చేస్తునట్టు కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ తెలిపారు.అదేవిధంగా ములుగులో గిరిజన యూనివర్సిటీకి కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.రూ.880 కోట్లతో ట్రైబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.సమ్మక్క -సారక్క గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు.

దాంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube