కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ జీవితాల్లో ఉన్న పోలికలు ఏంటో తెలుసా ?

హాస్యభరిత సినిమాలకు పెట్టింది పేరు శ్రీ జంధ్యాల గారు.అయన ఒక మాట చెప్పారు.” నవ్వడం ఒక భోగం.నవ్వించడం ఒక యోగం.

 Common Facts In Kota And Babu Mohan Life Kota Srinivasa Rao , Babu Mohan, Comed-TeluguStop.com

నవ్వకపోవడం ఒక రోగం” .అయన సినిమాల్లో ఇలాంటి మాటలు అనేకం ఉంటాయి.హాస్యంతో సినిమా తీయచ్చు అని చాటి చెప్పిన మహనీయుడు.ఇక ఆలా నవ్వించడానికి పుట్టినట్టుగా ఉంటారు ఈ ఇద్దరు కమెడియన్స్.వారే కోట శ్రీనివాస రావు మరియు బాబు మోహన్.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన హాస్యతాండవం మాములుగా ఉండేది కాదు.

దాదాపు ఈ ఇద్దరు కలిసి ఓకే పాతిక ముప్పై సినిమాల్లో జంటగా నటించి ఉంటారు.అప్పట్లో వచ్చిన ఏవండీ_ఆవిడొచ్చింది, మామగారు, బావ_బావమరిది, చినరాయుడు, అల్లరిఅల్లడు, రాజేంద్రుడు_గజేంద్రుడు, ప్రేమవిజేత, కన్నయ్య_కిట్టయ్య వంటి ఎన్నో,మరెన్నో సినిమాల్లో అద్వితీయంగా కామెడీ పండించారు.

అయితే వీరిద్దరూ పేరుకే కమెడియన్స్ కానీ వీరి జీవితాల్లో ఎంతో విషాదం వుంది.అంతే కాదు వీరి జీవితంలో అనేక విషయాల్లో పోలికలు కూడా ఉన్నాయ్.

అవేంటో ఒకసారి చూద్దాం.

కోట శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ లోని కనికపాడు అనే ఊరిలో 1947 జన్మించారు.

తన తండ్రి లాగ డాక్టర్ అవ్వాలన్న కూడా అది సాధ్యం కాకపోవడంతో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో జాబ్ చేసాడు.ఆ తర్వాత సినిమా పిచ్చి పెరిగిపోవడం తో ఉద్యోగం మానేసి 1978 లో ప్రేమ ఖరీదు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు.

ఇక తన వారసుడిని సినిమా ఇండస్ట్రీ కి తేవాలని అనుకున్నాడు.అప్పుడప్పుడే నటించడం మొదలు పెట్టిన కోట పెద్ద కుమారుడిని రోడ్డు ప్రమాదం మింగేసింది.

ఇక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు.ప్రస్తుతం వయోభారం తో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Telugu Allarialludu, Andhra Pradesh, Babu Mohan, Comedians, Kanikapadu, Kota, Ma

ఇక బాబు మోహన్ విషయానికి వస్తే 1952 లో ఖమ్మం లోని బీరోలు లో జన్మించాడు.తొలుత రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవాడు.అదే సమయంలో సినిమాల్లో నటించాలని ఉద్యోగం వదిలేసి ఆహుతి సినిమాతో చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చాడు.తన కొడుకు పవన్ ని సినిమాల్లోకి తీసుకొచ్చిన కొన్ని రోజులకే రోడ్డు ప్రమాదం లో అతడు మరణించాడు.

ఇక బాబు మోహన్ సైతం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి మంత్రిగా కూడా పని చేసాడు.లా కోట, బాబు మోహన్ జీవితాల్లో, సినిమా, ఉద్యోగం, కొడుకు మరణం, రాజకీయాలు వంటి అంశాలు ఒకే విధంగా ఉన్నాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube