అప్పుడు రమ్యకృష్ణ ఇప్పుడు వరలక్ష్మి.. మరో అద్భుతమైన నటి దొరికిందా?

సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలు పోషించాలంటే గుండె ధైర్యం ఉండాలి.

ఎందుకంటే ఆ పాత్రలలో మెప్పించకపోతే కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో పాటు సినిమాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

అయితే 20 సంవత్సరాల క్రితమే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి రమ్యకృష్ణ మెప్పించడంతో పాటు నీలాంబరి పాత్రకు ప్రాణం పోశారు.నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసే లేడీ విలన్స్ కు ఈ పాత్ర ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.బాహుబలి2 సినిమాలో పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు.అయితే రమ్యకృష్ణ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నటి ఎవరనే ప్రశ్నకు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

క్రాక్ సినిమాలో జయమ్మ రోల్ లో అదరగొట్టిన వరలక్ష్మి ఈ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు.

భానుమతి పాత్రలో తను తప్ప మరెవరూ నటించలేరనే స్థాయిలో వరలక్ష్మి నటించడం గమనార్హం.వీరసింహారెడ్డి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బాలకృష్ణ తర్వాత ఈ సినిమాకు అదే స్థాయిలో హైలెట్ గా నిలిచిందెవరనే ప్రశ్నకు వరలక్ష్మి పేరు సమాధానంగా వినిపిస్తోంది.అభినయ ప్రధాన పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ జీవించడం గమనార్హం.

Advertisement

వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ లోని బెస్ట్ రోల్స్ లో వీరసింహారెడ్డి ఒకటిగా నిలుస్తుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇతర భాషల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మరింత బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు