మామూలుగా కొంతమంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి అంత ఇష్టపడరు.కానీ మరి కొంతమంది మాత్రం ఎవరు ఉన్నారని కూడా చూసుకోకుండా.
తమ వ్యక్తిగత విషయాలు బయటకి చెబుతూ ఉంటారు.ముఖ్యంగా తమ ప్రేమ వ్యవహారాల గురించి కూడా ఓపెన్ గా చెబుతూ ఉంటారు.
అయితే తాజాగా బుల్లితెర ఆర్టిస్ట్ రోహిణి( Rohini ) కూడా తన ప్రేమ వ్యవహారం గురించి బయట పెట్టింది.ఇంతకు తను ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది.ఇక తను నటించిన కొంచెం ఇష్టం.కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత పలు సీరియల్లలో అవకాశాలు కూడా అందుకోగా.మాటీవీలో శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ తో కామెడీ కాకుండా తనలోని నటస్వరూపాన్ని కూడా బయటకు తెచ్చింది.
తర్వాత ఇన్స్పెక్టర్ కిరణ్( Inspector Kiran Serial ) అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.అలాగే జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ లో ఎన్నో అవార్డులను సంపాదించుకుంది.
సీరియల్స్ తోనే కాకుండా తన కెరీర్ లో ఇంకా ఎదగాలని బిగ్ బాస్ కి( Bigg Boss ) వెళ్ళింది రోహిణి.కానీ అనుకున్నంత ఫలితం రాకపోగా నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.
బిగ్ బాస్ తర్వాత కూడా రోహిణికి అనుకున్నంత అవకాశాలు రాలేదు.

కొన్ని సినిమాల్లో నటించిన సరే తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది.కేవలం టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పెడుతూ అందరి మనులను పొందుతూనే ఉంటుంది.యూట్యూబ్లో తనకంటూ ఒక ఛానల్ ఉంది.
అందులో తను చేసే ప్రతి విషయము వీడియోలుగా అప్లోడ్ చేస్తుంది.ఇక రీసెంట్ గానే తన కాళ్లకు.
గతంలో జరిగిన యాక్సిడెంట్( Accident ) సమయంలో వేసిన రాడ్ ను ఆపరేషన్ ద్వారా తీయించుకున్న సంగతి తెలిసిందే.

కాలు నొప్పిగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు చేస్తూ, బుల్లితెరపై షోలల్లో సందడి చేస్తూ ఉంది.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా నీకు నేను నాకు నువ్వు( Neeku Nenu Naaku Nuvvu Show ) అనే షోలో యాంకర్ రవితో పాటు తను కూడా యాంకరింగ్ చేస్తున్నట్లు కనిపించింది.ఇక ఆ షోలో సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్లు తమ ఫ్యామిలీతో వచ్చి బాగా సందడి చేసినట్లు కనిపించారు.

అంతేకాకుండా పెళ్లి కాక ముందుకు ఉన్న లవ్ విషయాలు గురించి కూడా అడిగారు.అయితే రోహిణి వేదిక మీదికి వచ్చి ఒక లవ్ పాటను( Love Song ) అద్భుతంగా పాడి అందరినీ ఫిదా చేసింది.ఇక తనకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అని అనటంతో వెంటనే యాంకర్ రవి.( Anchor Ravi ) నీకు లవ్, బాయ్ ఫ్రెండ్ లేడా అని అడగటంతో.ఉండేవాడు అని కానీ బ్రేకప్ చెప్పాను అని.ఆ సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్తే తన ఫ్రెండ్స్ తనను ఆ డిప్రెషన్ లో నుండి బయటికి తీసుకొచ్చారు అని.ఆఫ్ట్రాల్ వాడెంతనే అని అనటంతో నేను కూడా అలాగే అనుకున్నాను అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.







