హమ్మయ్య.. కమెడియన్ పంచ్ ప్రసాద్ కి కిడ్నీ దొరికింది...కానీ?

బుల్లితెర కమెడియన్ గా జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో సందడి చేస్తూ అందరిని ఆకట్టుకున్నటువంటి పంచ్ ప్రసాద్ (Punch Prasad) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలా తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించే పంచ్ ప్రసాద్ నవ్వుల వెనుక విషాద కాదా ఉందనే విషయం మనకు తెలిసిందే.

ఈయన రెండు సంవత్సరాలుగా కిడ్నీ (Kidney) వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు.ఇలా కిడ్నీలు పాడవడంతో డోనర్ కోసం గత రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈయన తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చారు.

ఇలా కిడ్నీ డోనర్ కోసం ఎదురుచూస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ కు వైద్యులు శుభవార్త తెలియజేశారు తనకు కిడ్నీ దొరికిందని డాక్టర్లు చెప్పడంతో ఇదే విషయాన్ని ప్రసాద్ భార్య యూట్యూబ్ ఛానల్ వేదికగా కిడ్నీ దొరికింది కానీ అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రెండున్నర సమస్యల క్రితం కిడ్నీ కోసం మేము అప్లై చేసుకున్నాము అయితే మాకు ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ కమ్యూనికేషన్స్ ప్రాబ్లం వల్ల చాలా ఆలస్యమైందని ఈమె తెలియజేశారు.

Advertisement

ఇక మాకు హాస్పిటల్ లో డాక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారని ప్రసాద్ భార్య తెలియజేశారు.

ఇలా రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రసాద్ కి కిడ్నీ దొరికిందని అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడానికి ముందుగా కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రసాద్ భార్య తెలియజేశారు.ఈ పరీక్షలన్నీ జరిగిన తర్వాతనే ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తారని తెలియజేశారు.ఇక ప్రసాద్ కి తన కిడ్నీ ఇస్తానని చెప్పగా డాక్టర్లు ప్రసాద్ ది చిన్న వయసు అని ప్రస్తుతం అతనికి ఇతరుల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని చెప్పారు.

ఇలా చేయటం వల్ల ఒక 20 సంవత్సరాలు వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ తర్వాత నా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసే విధంగా డాక్టర్లు ప్లాన్ చేశారని ఈమె తెలియజేశారు.ఇలా పంచ్ ప్రసాద్ కి కిడ్నీ దొరికిందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు