సినిమా ఇండస్ట్రీ( Film Industry )కి ఎంతోమంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు.కానీ అందులో కొంతమందిని మాత్రమే ఇండస్ట్రీ గుర్తు పెట్టుకుంటుంది.
వారు చేసిన పాత్రలు, నటించిన తీరు ప్రతి ఒక్కరి మదిలో వారు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు.అలా అందరికీ సాధ్యం కాదు.
కొన్ని ముఖ్యమైన పాత్రలో నటించిన మళ్లీ అలాంటి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉంటే పాత్రలు కొంతమంది నటులకు దొరక్కపోవచ్చు.అలాంటి లిస్టులోనే వస్తాడు నటుడు లక్ష్మణ్.
ఈ పేరు చెబితే కూడా చాలామంది గుర్తుపట్టరు.గతవారం రిలీజ్ అయిన మంగళవారం సినిమాలో ఈ నటుడు నటన అదిరిపోయింది అని చెప్పాలి.
లక్ష్మణ్( Lakshman ) నిజంగా ఒక మంచి పర్ఫార్మర్ అతడికి మంచి టాలెంట్ కూడా ఉంది కానీ మన తెలుగు సినిమా దర్శకులు అతనిలోని టాలెంట్ ని ఇప్పటివరకు సరిగ్గా వినియోగించుకోలేదని అనిపిస్తూ ఉంటుంది మంగళవారం సినిమా( Mangalavaram ) చూసిన తర్వాత లక్ష్మణ్ ని చాలామంది గుర్తుపడతారు ఎందుకంటే సినిమా పూర్తిస్థాయిలో అతడు కనిపిస్తూనే ఉంటాడు అయినా కూడా అతనికి పాత్రకు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదని అనిపిస్తుంది కానీ సినిమా పూర్తి అయ్యేసరికి అతడి నటనకు అందరూ ఫిదా అనే విధంగా ఉంటుంది.క్లైమాక్స్ దాదాపు పూర్తయిన తర్వాత అతడికి కాస్త స్కోప్ దొరికింది ఈ చిత్రంలో నటించడానికి.
అదేంటి సినిమా అయిపోయిన తర్వాత ఇతడు ఇప్పుడే సరిగ్గా నటిస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు సూపర్ గా నటించాడు అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఫీలయ్యే విధంగా లక్ష్మణ్ పాత్ర తీరు ఉంటుంది.కచ్చితంగా తను ఒక మంచి నటుడు అని నిరూపించుకున్నాడు అతను నటుడు మాత్రమే కాదు కళాకారుడు ఎందుకంటే తను నాటకాన్ని, సినిమాని మాత్రమే ప్రేమిస్తాడు.ఈ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే తన మూడు పూటలా సరిగ్గా తినే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు రెండు పూటలా కూడా తినలేక పోతున్నానని కానీ ఆ రెండు పూటలు మాత్రమే తనకు సంతృప్తి ఇస్తుందని, అందుకే నా జీవితం మొత్తం సినిమాకి నాటకానికే అంకితం అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.