కలర్స్ స్వాతి రెడ్డి, అభిషేక్ పిక్చర్స్, ఆదిత్య హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఇడియట్స్' ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా, రావణాసురుడు, డెవిల్ వంటి భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకీ ప్రాధాన్యత ఇస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్ నుండి తాజా ప్రొడక్షన్ వెంచర్ అమోఘ ఆర్ట్స్, ఎమ్‌ఎన్‌ఓపి కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ఇడియట్స్ అనే క్రేజీ టైటిల్ ని ఖారారు చేశారు.

రియల్ హీరోస్ అనేది ఉప శీర్షిక.ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలైంది.

కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇడియట్స్ తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక అంశాలతో కూడిన స్వచ్చమైన ప్రేమకథగా ఉండబోతుంది.ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రముఖ తారాగణం అంతా క్యారికేచర్‌ డిజైన్ లో ప్రతి పాత్ర విభిన్న భావోద్వేగాలతో కనిపించడం గమనించవచ్చు.

స్వాతితో పాటు నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష మరికొన్ని పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించాయి.పల్లెటూరి నేపధ్యంలో ఫస్ట్ లుక్ ప్లజంట్ గా వుంది.

Advertisement

ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా, సిద్దార్థ్ సదాశివుని సంగీత దర్శకుడిగా, అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రాఫర్ గా, అరుణ్ తాచోత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.తారాగణం: కలర్ స్వాతి రెడ్డి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష, నిత్య శ్రీ, సురేష్, రాజేంధర్ గౌడ్ తదితరులు.

సాంకేతిక విభాగం:

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్ సహా నిర్మాణం: అమోఘ ఆర్ట్స్ అండ్ ఎంఎన్ఓపీ, నిర్మాత: అభిషేక్ నామా, దర్శకత్వం: ఆదిత్య హాసన్, షో రన్నర్: నవీన్ మేడారం, సినిమాటోగ్రఫీ: అజీమ్ మహ్మద్, సంగీతం: సిద్దార్థ్ సదాశివుని, ఎడిటర్: అరుణ్ తాచోత్ ఆర్ట్ డైరెక్టర్: టిపోజీ దివ్య, సాహిత్యం: కందికొండ, కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు, లైన్ ప్రొడ్యూసర్: వినోద్ నాగుల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షర్వీన్ బన్ను మేడారం, సహ నిర్మాత: రాజేశ్వర్ బొంపల్లి, సీఈఓ: పోతిని వాసు, పీఆర్వో : వంశీ-శేఖర్.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్
Advertisement

తాజా వార్తలు