థియేటర్ లో విడుదల కానున్న కలర్ ఫోటో సినిమా.. ప్రేక్షకులు ఆదరిస్తారా!

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన చిత్రం కలర్ ఫోటో.ఈ సినిమాకు సందీప్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Colour Photo Theatrical Release On Novmber 19th 2022 Starrer Suhas And Chandini-TeluguStop.com

మొదట చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ ను అందుకుంది.అంతేకాకుండా ఇటీవల జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును సైతం సొంతం చేసుకుంది ఈ సినిమా.

అయితే ముందుగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఈ సినిమాను విడుదల చేశారు.

అయితే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఇందులో హీరో హీరోయిన్ల సహజ నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అదేమిటంటే ఈ సినిమా థియేటర్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా నిర్మాత సాయి రాజేష్, అలాగే డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సినిమాను వచ్చే నెల అనగా నవంబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనట్లు ప్రకటించారు.

Telugu Sandeep Raja, Suhas, Tollywood-Movie

ఇకపోతే ఈ సినిమాను అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇందులో హర్ష, శ్రీదివ్య, సునీల్ కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే.మరి ఓటీడీలో విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.అలాగే ఇప్పటికే ఓటీటీలో చాలాసార్లు ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు థియేటర్లో సినిమాను చూడడానికి ఇష్టపడతారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube