థియేటర్ లో విడుదల కానున్న కలర్ ఫోటో సినిమా.. ప్రేక్షకులు ఆదరిస్తారా!
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన చిత్రం కలర్ ఫోటో.
ఈ సినిమాకు సందీప్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.మొదట చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ ను అందుకుంది.
అంతేకాకుండా ఇటీవల జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును సైతం సొంతం చేసుకుంది ఈ సినిమా.
అయితే ముందుగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఈ సినిమాను విడుదల చేశారు.
అయితే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఇందులో హీరో హీరోయిన్ల సహజ నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అదేమిటంటే ఈ సినిమా థియేటర్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా నిర్మాత సాయి రాజేష్, అలాగే డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సినిమాను వచ్చే నెల అనగా నవంబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనట్లు ప్రకటించారు.
"""/"/
ఇకపోతే ఈ సినిమాను అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఇందులో హర్ష, శ్రీదివ్య, సునీల్ కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే.మరి ఓటీడీలో విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.
అలాగే ఇప్పటికే ఓటీటీలో చాలాసార్లు ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు థియేటర్లో సినిమాను చూడడానికి ఇష్టపడతారో లేదో చూడాలి మరి.
మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!