ఇక్కడ మీరు చూస్తున్నది వ్యవసాయ కూలీలు అనుకుంటే పొరపడినట్లే వారిరువురు ఐ.ఎ.ఎస్ అధికారులు ప్రక్క ప్రక్క జిల్లాలలైన బాపట్ల ప్రకాశం జిల్లాలలో కలెక్టెర్లు ఆ హోదాను ప్రక్కన పెట్టి సరదాగా వరినాట్లు వేశారు.కలెక్టర్లమని బిర్ర బిగుసుకోకుండా ప్రజలతో మమేకమై ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయకృష్ణన్ పనిచేస్తున్నారు.
భార్యా భర్తలైన ఈ ఇరు జిల్లాల కలెక్టర్లు నిరాడంబర జీవనం గడిపారు.ఈ మధ్యే చీరాలలో వారిద్దరూ సామాన్యుల మాదిరి వాకింగ్ చేస్తూ మీడియా కెమెరాలకు చిక్కారు.
ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు కలెక్టర్లు తమ పిల్లలతో కలిసి బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామంలోని పొలాలలో కూలీలతో జతకట్టి వరినాట్లు వేశారు.కూలీలకు ఏమాత్రం తీసిపోకుండా అంతే నైపుణ్యంతో వారు వరినాట్లు వేయడం విశేషం.
అంతేగాకుండా కూలీలతో కలిసి ఇద్దరు కలెక్టర్లు వారి పిల్లలు తాము తెచ్చుకున్న భోజనం కూలీలతో కలిసి తిన్నారు.అదే సమయంలో కూలీల జీవన స్థితిగతులనుకలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు.