ఖమ్మం జిల్లాలో పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం జిల్లాలో పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగంచే చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ అన్నారు.గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పీఆర్ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

 Collector Vp Gautham On Panchayat Raj Engineering Works, Collector Vp Gowtham,pa-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ గ్రాంట్ల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.సిఎస్ఆర్ గ్రాంట్ క్రింద జిల్లాలో 276 పనులు చేపట్టగా, 247 పనులు పూర్తయినట్లు, 7 ప్రగతిలో ఉండగా, 33 పనులు ఇంకనూ ప్రారంభం కానట్లు తెలిపారు.

సిడిపి గ్రాంట్ క్రింద 772 పనులు చేపట్టి, 614 పనులు పూర్తి కాగా, 28 పనులు ప్రగతిలో, 130 పనులు ఇంకనూ ప్రారంభించలేదని ఆయన అన్నారు.డిఎంఎఫ్టి క్రింద 421 పనులకు గాను, 394 పూర్తి కాగా, 6 ప్రగతిలో ఉండగా, 21 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు.

ఎస్డిఎఫ్ క్రింద 2509 పనులకుగాను 2192 పూర్తయినట్లు, 66 పనులు ప్రగతిలో, 251 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు.పీఎంజిఎస్వై, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎంపీలాడ్స్ తదితర గ్రాంట్ల క్రింద మంజూరయిన పనుల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.

ప్రగతిలో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి, పురోగతిపై రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు.ఇంకనూ ప్రారంభించని పనుల విషయంలో చర్యలు వేగం చేయాలన్నారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఇజె.సుదర్శన్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, ఖమ్మం సత్తుపల్లి పిఅర్ ఇఇలు కె.శ్రీనివాస్, చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, పిఆర్ డిఇలు శివగణేష్, వెంకటరెడ్డి, చంద్రు, కోటేశ్వరరావు, నళిని మోహన్, రాంబాబు, ఏఇఇ లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube