హిమాచల్ ప్రదేశ్ లో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చక్రి నదికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది.
దీంతో కాంగ్రా జిల్లాలోని చక్రి నదిపై ఉన్న రైల్వే వంతెన కుప్పకూలిపోయింది.ఈ వంతెన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలను కలుపుతుంది.
మరోవైపు, జిల్లాలోని బల్హ్, సాదర్, తునంగ్, మండి ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వచ్చే 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రైల్వే వంతెన కూలిపోవడంతో పఠాన్ కోట్, జోగిందర్ నగర్ మధ్య రైల్వే సేవలు నిలిచిపోయాయి.ఈ మార్గం గుండా సుమారు ఏడు రైళ్లు ప్రయాణిస్తుంటాయి.