కుంగిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగింది.

ఈ మేరకు వంతెన 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ వరకు బ్రిడ్జి కుంగిందని అధికారులు చెబుతున్నారు.

దీంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు 46 గేట్లను ఎత్తి డ్యామ్ లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.వంతెన కుంగిపోయిన నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్ మీదుగా తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

అయితే వంతెన కుంగిపోయిన విషయంలో సంఘ విద్రోహుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలో పోలీసులు బ్యారేజ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు