మనం కాఫీగాని, టీ గాని తాగాలంటే టీ పొడి, పాలు కావలిసిందే కదా.కానీ, అక్కడ మాత్రం కాఫీ ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు.
ఆ ఊరిలో పక్షులు రెట్టలతో కాఫీ తయారుచేస్తారు.అవును.
మీరు విన్నది నిజమే పక్షులు విసర్జించే మలంతోనే అక్కడ రుచికరమైన కాఫీని తయారు చేస్తున్నారు.మనకి వినడానికి అదోలా ఉన్నాగాని నిజంగానే అక్కడ పక్షుల రెట్టలతో కాఫి పెడతారట.
పైగా ఈ కాఫీకి మంచి డిమాండ్ కూడా ఉంది.అసలు ఈ పక్షి రెట్టల కాఫీని ఎక్కడ తయారు చేస్తున్నారు.? ఎలా తయారు చేస్తున్నారు.? అనే విషయాలను తెలుసుకుందాం.!
కామోసిమ్ ఎస్టేట్ కు బ్రెజిల్‌లోనే అత్యంత చిన్న కాఫీ ప్లాంటేషన్ గా పేరుంది.50 హెక్టార్లలో విస్తరించిన కాఫీ తోటల వల్ల ఉత్పత్తి తక్కువగానే ఉండవచ్చు.కానీ, రాబడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది.ఇందుకు కారణం.జాకు బర్డ్ (జాకు పక్షి).ఈ పక్షుల వల్ల ఆ కాఫీ ఎస్టేట్ కు ఎక్కడా లేని పేరు వచ్చేసింది.
అదెలా అనుకుంటున్నారా.?! ఆ ఎస్టేట్ యజమాని హెన్రిక్ స్లోపర్ డి అరాజో.అతని ఎస్టేట్ లో ఉన్న మొత్తం కాఫీ మొక్కలను పక్షులు నాశనం చేస్తూన్నాయి.దీనితో ఆయనకు ఏమి చేయాలో అర్థం కాలేదు.
అయితే ఆ పక్షులను ఏమన్నా చేయాలంటే ఏమి చేయలేని పరిస్థితి.ఎందుకంటే బ్రెజిల్ లో ఉన్న పక్షి జాతుల్లో జాకు పక్షి ప్రత్యేకమైనది కాబట్టి ఏమి చేయడానికి లేదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినాగాని పక్షులు పోవడంలేదు.అదే సమయంలో అతడికి బుర్రకు ఒక ఐడియా వచ్చింది.

ఇండోనేషియాలో పునుగు పిల్లి మలంతో కాఫీ చేసినప్పుడు జాకు పక్షుల మలంతో కాఫీ ఎందుకు చేయకూడదు అనుకున్నాడు.అనుకున్నదే తడువుగా ఆలోచన అమలు చేసాడు.ఆ కాఫీ గింజలను పక్షులు చాలా ఇష్టముగా తింటాయి.కాబట్టి.వాటి మలంలో అవే ఎక్కువగా ఉంటాయని హెన్రిక్ భావించాడు.ఇక నుంచి కాఫీ గింజలు కాకుండా జాకు పక్షుల రెట్టలను సేకరించాలని కూలీలకు చెప్పాడు.
యజమాని మాటలకూ షాక్ అయ్యి చేసేది లేక జాకు పక్షుల రెట్టలను కలెక్ట్ చేసి ఆయన ముందు పెట్టారు.అనంతరం ఆ రెట్టల్లో ఉండే కాఫీ బీన్స్ ను వేరు చేసి.
వాటిలోని పోషకాలు, రుచికి నష్టం లేకుండా శుభ్రంగా చేశాడు.అనంతరం ఆ గింజలతో కాఫీ తయారు చేసి రుచి చూశాడు.
అంతే.అది రెగ్యులర్ కాఫీ కంటే రుచిగా అనిపించింది.
పక్షులు ఆ కాఫీ గింజలను ఆహారంగా తీసుకున్నా.వాటి కడుపులో విడుదలయ్యే యాసిడ్ల వల్ల ఆ కాఫీ గింజలు రోస్ట్ అవుతాయట.
ఫలితంగా వాటికి సాధారణ గింజలు కంటే ఎక్కువ రుచి లభిస్తుందని హెన్రిక్ తెలిపారు.ఒక కిలో పక్షి రెట్టల ధర వెయ్యి డాలర్లు (రూ.72,659) పలుకుతుంది అంటే ఎంత ఫేమస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు.