అరుదైన రికార్డు సృష్టించిన కొచ్చిన్ షిప్‌యార్డ్...

తాజాగా కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ సంస్థ ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది.ఈ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ నౌకలను మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాకుండా ఎగుమతులు చేయడం కూడా స్టార్ట్ చేసింది.

 Cochin Shipyard Manufacturing And Exporting Electrical Ships Details, Cochin Shi-TeluguStop.com

నిజానికి ఎలక్ట్రిక్ నౌకలను ఇప్పటివరకు చైనా తప్ప మరే ఇతర దేశం తయారు చేయలేదు.అయితే తాజాగా భారతదేశం ఈ ఘనత సాధించి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇటీవల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ రెండు ఎలక్ట్రిక్‌ నౌకలను నార్వేలోని అస్కో మారిటైమ్‌ ఏఎస్‌ కంపెనీకి ఎగుమతి చేసింది.

డచ్‌ దేశానికి చెందిన యాచ్‌ సర్వెంట్‌ షిప్‌ ఈ ఎలక్ట్రిక్‌ షిప్స్‌ను 60 రోజుల్లో నార్వేకు తీసుకెళుతుంది.

వీటిని చాలా అధునాతనంగా తయారు చేశారు.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బోర్డును అందించడం వల్ల ఇవి సిబ్బంది లేకుండా వాటంతటవే ప్రయాణాలు చేయగలవు.

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌-సీఎస్‌ఎల్‌ అనేది షిప్స్ మేకింగ్ లో తన సత్తా చాటుతోంది.విశేషమేంటంటే, సీఎస్‌ల్‌ తయారుచేసే నౌకలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ నెలకొంది.

తాజాగా తయారు చేయడం ప్రారంభించిన గ్రీన్ ఎనర్జీ షిప్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది.సీఎస్‌ఎల్‌ తయారుచేసిన నౌకలకు మారిస్‌, థెరిసా అని నామకరణం చేశారు.

ఈ నౌకల పొడవు 67 మీటర్లు.ఆటోమేటిక్ గా నడిచే ఇవి ఫుల్లీ లోడెడ్ 16 ఐరోపా కంటైనర్లను సునాయాసంగా రవాణా చేయగలవు.

ఈ నౌకలు ప్రతి గంటకు 1846 కిలోవాట్ల విద్యుత్‌ను వాడతాయని.

Telugu Cochin Shipyard, Ships, Marristheresa, Norway, Rare, Yacht Servant-Latest

ఛార్జింగ్‌ కూడా ఫాస్ట్ గా చేసుకుంటాయని భారత సంస్థ వివరించింది.ఇందులో అందించిన అటానమస్ సిస్టమ్‌ సహాయంతో ఈ నౌకలు వాటంతట అవే అన్ని పనులను చేసుకోగలవు.

ఎలక్ట్రిక్‌ నౌకల అందుబాటులోకి వస్తే సముద్ర జలాల ఎక్కువగా కలుషితం కావు.

ప్రస్తుతం నౌకల నుంచి లీకయ్యే ఫ్యూయల్ వల్ల ఎన్నో జలచరాలు మృత్యువాత పడుతున్నాయి.కొన్ని అనారోగ్యానికి గురై నరకయాతన అనుభవిస్తున్నాయి.

ఇలాంటి సమస్యకు ఎలక్ట్రిక్‌ నౌకలు పరిష్కారం కానున్నాయి.సముద్ర జలాల్లో కాలుష్యం ఎంత ఎక్కువగా పెరిగితే వాతావరణ మార్పులు అంత తీవ్రంగా మారతాయని ఇప్పటికే పర్యావరణవేత్తలు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గ్రీన్‌ ఎనర్జీ నౌకలు మాత్రమే వాడే ఎందుకు అనేక దేశాలు మొగ్గు చూపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube