వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసులకి: సిబ్బందిపై సీఎన్ఎన్ ఆగ్రహం, ముగ్గురు ఉద్యోగుల తొలగింపు

అమెరికాను పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.

నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా టీకా అందుబాటులోకి వచ్చింది.

నాటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అగ్రరాజ్యం విజయవంతంగా అమలు చేస్తోంది.ఇంత జరుగుతున్నా ప్రజల్లో ఏదో భయం, ఏదో అనుమానం.

టీకా తీసుకోవడం మంచిదేనా, ఏమైనా దుష్పరిణామాలు వస్తే పరిస్ధితేంటీ అన్న ఆందోళన పలువురిని వెంటాడుతోంది.కానీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.మిలియన్ డాలర్ల విలువ చేసే లాటరీలు.

Advertisement

ఉచిత బీర్లు.మారిజువానా షాట్లు.

రైఫిళ్లు.ఇలా ఎన్ని ఆఫర్లు ప్రకటించినా కొంత మంది మాత్రం టీకా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు.

ఇప్పుడే కాదు.రానున్న రోజుల్లో కూడా తాము టీకా వేయించుకునేది లేదని తేల్చిచెబుతున్నారు.

అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం సీరియస్‌గా తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో రెండు డోసుల టీకా తీసుకోకుండా ఆఫీసుకు వ‌స్తున్న ముగ్గురు ఉద్యోగుల‌పై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ వేటు వేసింది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

సీఎన్ఎన్ చీఫ్ జెఫ్ జుక‌ర్ ఈ విష‌యాన్ని ఓ మెమో ద్వారా తోటి ఉద్యోగుల‌కు తెలియ‌జేశారు.ఆఫీసుకు రావాలంటే క‌చ్చితంగా వ్యాక్సిన్ వేసుకుని ఉండాల‌ని ఆయ‌న ఆ మెమోలో స్ప‌ష్టం చేశారు.

Advertisement

ఫీల్డ్ రిపోర్టింగ్‌కు వెళ్లే వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకుని ఉండాల‌ని, ఎందుకంటే వాళ్లు బహిరంగ ప్రదేశాల్లో మ‌రొక‌రితో ట‌చ్‌లోకి వ‌స్తుంటార‌ని తెలిపారు.వ్యాక్సిన్ వేసుకోని వారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించేది లేదని జుకర్ స్పష్టం చేశారు.

అయితే తొలగించిన ఉద్యోగులు ఎవ‌రు, వాళ్లు ఎక్క‌డ ప‌నిచేస్తున్నార‌న్న విష‌యాన్ని మాత్రం సీఎన్ఎన్ వెల్ల‌డించ‌లేదు.మరోవైపు స్వ‌చ్ఛంధంగా సీఎన్ఎస్ వార్తా సంస్థ ఆఫీసుల‌ను తెరుస్తున్నారు.

న్యూస్ ఛాన‌ల్‌లో ప‌నిచేస్తున్న మూడ‌వ వంతు సిబ్బంది ఆఫీసులకు వ‌స్తున్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది.అయితే వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు స‌ర్టిఫికేట్ ఉండాల‌ని ఉద్యోగులకు ఆ సంస్థ షరతు విధించింది.

అట్లాంటా, వాషింగ్ట‌న్‌, లాస్ ఏంజిల్స్‌లో ఉన్న ఆఫీసుల్లో మాస్క్ కూడా త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని సీఎన్ఎన్ చెప్పింది.

మరోవైపు అమెరికాలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది.గత కొన్ని రోజులుగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఒక్క అమెరికా నుండే వస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో అగ్రరాజ్యం చివురుటాకులా వణికిపోతోంది.

తాజా వార్తలు