గుంటూరులో వైయస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం( CM jagan )రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళాలో భాగంగా.రూ.361.29 కోట్ల వ్యయంతో 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను గుంటూరులో పంపిణీ చేయడంతో పాటు రూ.125.48 కోట్ల సబ్సిడీని రైత సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్.ఇప్పటికే మొదటి మెగా మేళాలో రూ.240.67 కోట్ల సబ్సిడీతో రూ.690.87 కోట్ల విలువైన 6,525 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తున్న 3,800 ట్రాక్టర్లు, 391 కంబైన్ హార్వెస్టర్లు, 22,580 ఇతర వ్యవసాయ పనిముట్లు అందించిన వైఎస్.జగన్ ప్రభుత్వం.
అన్నదాతల సాగు అవసరాలను తీర్చి, యాంత్రీకరణ ద్వారా సాగు వ్యయం తగ్గించి, నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో.రైతన్నలు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు, 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణంతో వారికి యాంత్రీకరణ అందుబాటులోకి తీసుకువచ్చి తద్వారా ఆర్బీకే ప్రాంతంలో ఉన్న మిగిలిన రైతులకు తక్కువ ధరకే యంత్రసేవ అందుబాటులోకి తీసుకురావాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతి ఆర్బీకే పరిధిలోకి విస్తరిస్తూ…‘వైఎస్సార్ యంత్రసేవ( YSR Yantra Seva )’.ఉదయం 9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని, అక్కడ నుంచి చుట్టుగుంట వెళ్తారు.చుట్టుగుంటలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైయస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైయస్.జగన్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభిస్తారు.
కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.