జగనన్న విదేశీ విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయనున్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి( CM YS jagan ).గడచిన 6 నెలల్లో “జగనన్న విదేశీ విద్యా దీవెన” క్రింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు.వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ / టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21 ఫ్యాకల్టీలకు సంబంధించి టాప్-50 ర్యాంక్లు సాధించిన కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో సహా.దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువు కునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం.

 Cm Ys Jagan Will Be Credited Jagananna Vidya Deevena Amount To The Accounts O-TeluguStop.com

అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో “జగనన్న విదేశీ విద్యా దీవెన( Jagananna Vidya Deevena )”.ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు.

సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక.నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంపిక చేయబడ్డ 21 ఫ్యాకల్టీలకు సంబంధించి టాప్ – 50 యూనివర్శిటీల ఎంపిక.

పూర్తి ఆర్థిక సాయం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ.1 కోటి వరకు ఎంతైతే అంత 100% ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్( Fee Reimbursement ).విమాన, వీసా ఛార్జీలు సైతం రీయింబర్స్మెంట్.విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కోమెట్టూ ఎక్కే కొద్ది 4 వాయిదాల్లో స్కాలర్ షిప్స్ మంజూరు.ఇమ్మిగ్రేషన్ కార్డు (ఐ-94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత 3వ వాయిదా.

విజయవంతంగా 4వ సెమిస్టర్ పూర్తి చేసి మార్క్ షీట్ ఆన్లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసాక చివరి వాయిదా చెల్లింపు.కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి అర్హతను రూ.8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం.మరిన్ని వివరాల కోసం https://jnanabhumi.ap.gov.in ను సందర్శించండి.”జగనన్న విదేశీ విద్యా దీవెన”కు సంబంధించిన సహాయం, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం (1902 టోల్ ఫ్రీ నంబర్)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube