తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.
ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ( Atram Suguna ) నామినేషన్ దాఖలు చేయనుండగా.నిజామాబాద్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి( Jeevan Reddy ) నామినేషన్ వేయనున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ముందుగా ఆదిలాబాద్ కు( Adilabad ) వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన ముగిసిన అనంతరం నిజామాబాద్ కు( Nizamabad ) చేరుకోనున్నారు.అక్కడ నామినేషన్ కార్యక్రమం తరువాత సాయంత్రం 4.15 గంటలకు మల్కాజ్ గిరి( Malkajgiri ) నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.







