ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధికి సహాకరించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కోరారని తెలుస్తోంది.అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, నేషనల్ హైవేస్ తో పాటు స్టేట్ సేల్స్ ట్యాక్స్ నిధులపై చర్చించారని సమాచారం.
తరువాత 20 అంశాలతో కూడిన రెప్రజెంటేషన్ మోదీకి ఇచ్చారని తెలుస్తోంది.