మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy )తో పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఎమ్మెల్యే నివాసానికి చేరుకోనున్నారు.
ఈ క్రమంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమీక్షకు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి( Chamala Kiran Kumar Reddy )తో పాటు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు.మరోవైపు ఈ నెల 14 నుంచి మే 11వ తేదీ వరకు రేవంత్ రెడ్డి సభలను నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు ఆయన సూచనలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.