తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) “గ్రామసభల” కార్యక్రమం చేపట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం వద్దకు ప్రజలు కాదు, ప్రజల వద్దకే ప్రభుత్వం.
ఇదే ప్రజాపాలన ఉద్దేశం అని స్పష్టం చేశారు. “ప్రజావాణి” ( Praja Vani ) కార్యక్రమం చేపట్టిన తర్వాత సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ లో ప్రజా భవన్ వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపించడానికి “గ్రామసభల” కార్యక్రమం చేపటబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్తారు అని అన్నారు.నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.“ప్రజావాణి” లో తీసుకున్న విధంగానే “గ్రామసభల”లో రేషన్ కార్డు( Ration Card ) లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.భూముల ఇబ్బందులు అయినా అన్నీ కూడా దరఖాస్తుల ద్వారా స్వీకరిస్తాము.ఈ రకంగా ఆ సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా.పరిష్కారం కలిగే విధంగా చూసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది.

పథకాలు అన్ని వర్గాల ప్రజలకు పేదవాళ్ళకి అందించాలని లక్ష్యంతోనే “గ్రామసభలు”( Grama Sabha ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఎలాంటి పథకమైన లబ్ధిదారులకు చేరాలి అంటే.సరైన సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలి.
ఇందుకు అనుగుణంగా… అభయ హస్తం దరఖాస్తు విడుదల చేయడం జరిగింది.గత 10 సంవత్సరాలు ప్రభుత్వం ప్రజల వద్దకు చేరుకోలేకపోవటంతో సమస్యలు ఇప్పుడు మోయలేనంత భారంగా మారిపోయాయి.

దీంతో “ప్రజావాణి” కార్యక్రమం వారంలో రెండు రోజులు నిర్వహిస్తే 24 వేలకు పైగా అర్జీలు వచ్చాయి.వీటన్నిటిని విశ్లేషించి ఆయా శాఖలకు.ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా.సహచర మంత్రులతో చర్చించడం జరిగింది.ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తే తగిన న్యాయం జరుగుతుందని… తెలియజేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు