తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆలోచనలు చేస్తూ మరోపక్క పాలనపరంగా ప్రక్షాళన చేస్తున్నారు.
ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వ ఉన్నత అధికారులను కూడా తొలగిస్తున్నారు.ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో.రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన కాంగ్రెస్ పార్టీ ( Congress party )చేయటం తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయటానికి సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు.
తెలంగాణలో చాలామంది యువత డిగ్రీ, పిజీ, పీహెచ్.
డి చేసి ఉద్యోగాలు రాక తీరని అన్యాయం జరిగింది.అంటూ శాసనమండలిలో ప్రసంగించారు.
TSPSC కమిషన్ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందని.హైకోర్టు మొదటి లోనే తెలియజేసింది.
అర్హత లేని వారిని నియమించారు.అయితే త్వరలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను తీసుకుంటున్నాం.
మెగా డీఎస్సీ నిర్వహించి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజులుగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.తక్కువ పోస్టులతో ప్రకటన చేయటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరిగింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..మెగా డీఎస్సీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటన చేయటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.