CM Revanth Reddy :సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్( Hyderabad ) లోని సచివాలయం లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం అయ్యారు.

 Cm Revanth Reddy Important Instructions To Officials On Tax Collection-TeluguStop.com

కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్, రవాణా, మైన్స్ మరియు జియాలజీ, టీఎస్ఎండీసీ( TSMDC ) విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలపై ఆరా తీశారు.అలాగే ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు( Tax Collections ) జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కీలక సూచనలు చేశారు.రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టీలరీల వద్ద సీసీ కెమెరాలు( CCTV Camreas ) ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube