ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాస్త ఆందోళన చెందుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలు రేవంత్ లో టెన్షన్ కలిగిస్తున్నాయి.119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే.కాంగ్రెస్( Congress ) మొన్న జరిగిన ఎన్నికల్లో 64 స్థానాలలో విజయం సాధించగా, బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది.
అంటే సిపిఐ తో కలుపుకుంటే కాంగ్రెస్ కు 65 స్థానాలు మాత్రమే ఉన్నాయి.అయితే ఇప్పుడు బిజెపి బీ ఆర్ ఎస్( BJP BRS ) కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వారి వైపుకు తిప్పుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటనే విషయంలోనే కాంగ్రెస్ నేతలలో టెన్షన్ కనిపిస్తోంది.
దీనిపై అనేక అనుమానాలు రేవంత్ తో పాటు ఆ పార్టీ కీలక నాయకులు అందరిలోనూ కలుగుతున్నాయి .కేసిఆర్ ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రేవంత్ లో ఈ అనుమానం మరింతగా పెరిగిపోయింది.

అసలు కేసీఆర్( KCR ) శాసనసభలోనే అడుగు పెట్టరని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం మొన్నటివరకు జరిగింది.కేసీఆర్ ప్రమాణ స్వీకారంతో ఆ ప్రచారానికి తెరపడింది.దీనికి తోడు తరచూ రేవంత్ రెడ్డి కేసిఆర్ ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్నారు.అ భయంతోనే తనను కలిసేందుకు ఏ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కోరినా వెంటనే స్పందిస్తూ, వారి సమస్యలను ఓపిగ్గా వింటూ నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కేటాయిస్తూ, వారితో సఖ్యతగా ఉంటున్నారు.
బిజెపి బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) పై కుట్రలు చేస్తారేమో అన్న అనుమానం రేవంత్ లో ఉండడంతోనే , ఎమ్మెల్యేలతో ఈ స్థాయిలో సఖ్యతగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే రేవంత్ ఈ స్థాయిలో ఆందోళన చెందడం వెనుక నిజంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు బిజెపి సహకారం అందించే ప్లాన్ చేస్తోందా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

ఈ మేరకు ఇంటిలిజెన్స్ నివేదికలు రేవంత్ కు అందడంతోనే ఆయన ముందుగానే అలర్ట్ అవుతూ, పార్టీ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.బీహార్, జార్ఖండ్ లలో చోటు చేసుకున్న ఘటనలు చూస్తే బిజెపి ఎంతవరకైనా తెగిస్తుందనే భయమూ రేవంత్ లో స్పష్టంగా కనిపిస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేసిఆర్ కు బిజెపి( BJP ) సహకారం అందిస్తే.
అప్పుడు పరిస్థితి తారుమారు అవుతుందని రేవంత్ టెన్షన్ పడుతున్నారట.