కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒక్కటేనంటూ మండిపడ్డారు.
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పర్యటించిన కేసీఆర్ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.బాధిత రైతులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.
దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కేంద్రం తీరు ఉందని విమర్శించారు.నష్టపోయిన రైతులకు కేంద్రం పైసా ఇవ్వదన్నారు.
పరిహారం అంతా రాష్ట్రమే ఇస్తుందని తెలిపారు.కేంద్రానికి రైతుల గోస పట్టదని మండిపడ్డారు.