నేడు హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభం..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రారంభించనున్నారు.

ప్రతి దళిత కుటుంబాని కచ్చితంగా దళిత బంధు పథకం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా పైకి తీసుకు వస్తుందని టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ పథకాన్ని ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద హుజరాబాద్ నియోజకవర్గం లో.సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఈ క్రమంలో హుజరాబాద్ నియోజకవర్గం లో దాదాపు ఇరవై నాలుగు వేలకు పైగా కుటుంబాలు ఉండటంతో.వాళ్లు ఎంతగానో సంతోషపడుతున్నారు.మరోపక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.

కెసిఆర్ ఓటమి భయం తో.ఈ దళిత బందు పథకాన్ని తెరపైకి తెచ్చారని విపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు.ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని కేసీఅర్ భావిస్తున్నట్లు మరోపక్క టిఆర్ఎస్ నేతలు అంటున్నారు.

Advertisement

ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం లో కెసిఆర్ పర్యటించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు.భారీగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు