ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. అమరావతిలో తొలిసారిగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సమావేశాన్ని ఆయన నిర్వహించనున్నారు.
సంక్రాంతి తర్వాత ఏపీలోకి లాంఛనంగా ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. జనవరిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటి నుంచి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని దూకుడుగా విస్తరించాలని చూస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ను బలోపేతం చేసే బాధ్యతను తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఏపీ సభ బాధ్యతలను అప్పగించారు.
అమరావతిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టేందుకు BRS ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.BRS జాతీయ రాజకీయ పార్టీగా మారాలంటే, దానికి కనీస ఓటింగ్ శాతం మరియు ఇతర రాష్ట్రాల్లో ఉనికి అవసరం. ఇందుకోసం ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే జనాభాపై కూడా దృష్టి సారించి, అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను దాఖలు చేయాలని ఆయన యోచిస్తున్నారు.కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో గత 5 రోజులుగా వివిధ జాతీయ రాజకీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
BRS విస్తరణ ప్రణాళికలపై చర్చిస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే తలసానితో క్లోజ్డ్ డోర్ సమావేశమై తదుపరి ఏపీలో పార్టీని విస్తరించే ప్రణాళికపై చర్చించనున్నారు.

టీడీపీలో ఉన్న సమయంలో తలసానికి ఏపీ నేతలతో మంచి అనుబంధం ఉంది. తలసాని తరచుగా ఏపీకి టూర్ చేస్తుంటారు సంక్రాంతి పండుగ సమయంలో ఏపీలో పర్యటిస్తుంటారు. కోడి పందాల్లో పాల్గొంటారు.అయితే ఏపీలో పార్టీని ప్రజల అదిరించాలంటే వారికి దగ్గరగా ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై పొరాటం చేయాలి. అయితే దీని కోసం రాజధాని అంశాన్ని ప్రధానంగా ఎంచుకోనున్నట్లుగా సమాచారం.
అమరావతిని రాజధానిగా ప్రారంభించిన సమయంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా హజరైన విషయం తెలిసిందే.కావున అమరావతి అనుకూలంగా కేసీఆర్ ఉద్యమించబోతున్నట్లుగా తెలుస్తుంది.