కేంద్రంపై కేసీఆర్ సీరియస్.. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఆధారాల సేకరణ!!

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని, ఈ వ్యవహారంలో కేంద్రంలోని పెద్దల హస్తం ఉందని నిరూపించడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని, త్వరలో ఈ తతంగాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

దీనిపై విచారణ జరుగుతోందని, పూర్తి ఆధారాలతో జాతీయ మీడియా ముందు వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ముగ్గురు అరెస్ట్ కొనసాగుతున్న విచారణ

ఈ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోందని, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నట్లు సీఎం కేసీఆర్ పార్టీ వర్గాలకు చెప్పినట్లు సమాచారం.

ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.అయితే ఈ వ్యవహారంలో ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉన్నట్లు సదరు స్వామీజీ కాల్ రికార్డింగ్స్ లో వివరాలు సేకరించినట్లు సమాచారం.బీజేపీ హస్తం ఉందని రుజువు చేయడానికి ఆధారాలు ఉన్నాయని,

పూర్తి విచారణ ముగిసిన తర్వాత జాతీయ మీడియా సంస్థలకు వివరాలు సమర్పించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.అయితే నిందితులను రిమాండ్‌కు పంపకుండా మీడియా ముందు ఉంచితే పోలీసుల విచారణకు ఆటంకం కలుగుతుందని, అందుకే విచారణ ముగిసిన తర్వాత ఆధారాలు బయటపెట్టనున్నట్లు టీఆర్ఎస్ నేత ఒకరు చెప్పారు.

Advertisement

ప్రగతిభవన్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నట్లు నిందితులు నందకుమార్, ఇద్దరు స్వామీజీలు తమకు చెప్పినట్లు నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు చెప్పినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఇదే తరహాలో కొనుగోళ్లు జరుపుతున్నట్లు ఆధారాలు కూడా లభించాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), పైలట్ రోహిత్ శెట్టి (తాండూర్) బుధవారం రాత్రి నుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్నట్లు సమాచారం.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు