ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా జమ్మలమడుగు, పులివెందులలో పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు.
ముందుగా సున్నపురాళ్లపల్లెకు వెళ్లనున్న సీఎం జగన్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు భూమిపూజ చేయనున్నారు.స్టీల్ ప్లాంటు మౌలిక సదుపాలయాలపై అధికారులతో సమావేశమవుతారు.
తర్వాత పులివెందులలో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు.
జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.







