YSRCP YS Jagan : పార్టీ సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షుల సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఏకంగా 175/175 టార్గెట్ గా పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

 Cm Jagan's Key Comments In The Meeting Of Party Coordinators And District Presid-TeluguStop.com

ఈ క్రమంలో ఈరోజు వైసీపీ పార్టీ సమన్వయకర్తలు మరియు జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైసీపీ అధినేతగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.వాలంటీర్ వ్యవస్థ మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరూ లేదా ముగ్గురు చొప్పున 5.20 లక్షల మంది వైసీపీ ప్రజాప్రతినిధులను.నియమించాలని సూచించారు.

ఈ విధంగా పార్టీ తరపున నియమింపబడిన వారిని గృహసారథులుగా పిలవండి అని తెలిపారు.

ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిల వివరించాలని సూచించారు.అలాగే పది రోజుల్లో బూత్ కమిటీలను నియమించాలని ఆదేశించడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉండాలని అన్నారు.దీంతో  రాష్ట్రం మొత్తం మీద 45 వేల మంది కన్వీనర్లు.

ఎంపిక చేసే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు ఇన్చార్జీలకు.అప్పగిస్తున్నట్లు తెలియజేశారు.

వచ్చే ఎన్నికలలో మొత్తం 175 స్థానాలను గెలవటమే అందరి టార్గెట్ అని మీటింగ్ లో పాల్గొన్న వారికి వైసీపీ అధినేత జగన్ దిశా నిర్దేశం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube