ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రివర్గంలో మార్పులు తప్పవని సీఎం జగన్ హెచ్చరికలు చేశారని తెలుస్తోంది.
మంత్రుల పనితీరును తాను గమనిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.ఈ నేపథ్యంలో మంత్రులు సక్రమంగా పని చేయకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నీ గెలవాలన్నారు.ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
అదేవిధంగా అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.







