ఏపీ సీఎం జగన్ రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు జగన్ హాజరుకానున్నారు.
ఈ మేరకు ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుండి బయలుదేరనున్నారు.వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు.
అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.