ప్రస్తుతం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు.2024 ఎన్నికల్లో గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.దీనికోసం అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేసే పనికి శ్రీకారం చుట్టారు.తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్నా.ప్రజల్లో ఏదో తెలియని అసంతృప్తి ఉందనే విషయాన్ని జగన్ గుర్తించి, గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు.ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు వెళ్లి, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే విషయంపైనే జగన్ దిశ నిర్దేశం చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా… సొంత పార్టీ నాయకులు మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ప్రతి నియోజకవర్గంలోనూ రెండు మూడు గ్రూపులు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.
దీని కారణంగా వివాదాలు ఏర్పడడం, ప్రతిపక్షాలకు ప్రజలకు చులకన అవుతూ ఉండడం వంటి విషయాలను జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.
మొదటి నుంచి ఇదే రకమైన పరిస్థితి ఉన్నా.ఎప్పటికప్పుడు పరిస్థితులు చక్కబడతాయని ఆశా భావంతో జగన్ ఉంటూ వచ్చారు.అయినా ఇప్పటికీ మార్పు రాకపోవడం ఈ గ్రూపు రాజకీయాలు కారణంగా పార్టీ పరిస్థితి దెబ్బతిని ప్రతిపక్షాలు బలం పొందుకొంటూ ఉండడం వంటి విషయాలపై గత కొద్ది రోజులుగా పెట్టారు.
దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది ? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ?

ప్రజల్లో వారి గురించిన అభిప్రాయాలు ఏమిటి ? ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్ ఇస్తే గెలుస్తారా లేదా ? ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది ఇలా అనేక అంశాలపై సర్వే చేయించినట్లు సమాచారం.ఈ సర్వే నివేదిక జగన్ కు అందడంతో… ఆ సర్వే నివేదికను అధ్యయనం చేసే పనిలో పడ్డారట.దీంతోపాటు తమ రాజకీయ ప్రత్యర్థులైన జనసేన, బిజెపి, టిడిపిలు ఏం మేరకు బలం పెంచుకున్నాయి ? రాబోయే ఎన్నికల్లో వాటి ప్రభావం ఎంత ఉంటుంది ? ఏ ఏ నియోజకవర్గాల్లో టిడిపి గెలిచే అవకాశం ఉంది ? ఆ పరిస్థితిని మార్చి వైసిపి పట్టు పెంచేందుకు ఇంకేమి చేయాలి అనే విషయాలపై జగన్ సీరియస్ గానే దృష్టి సారించారట.

అలాగే మంత్రుల పనితీరుపైనా సర్వే చేయించినట్లు సమాచారం.ప్రస్తుతం మంత్రులలో ఎంతమంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ? వారి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ? మళ్లీ టికెట్ ఇస్తే వీరిలో ఎంతమంది గెలుస్తారు ? సొంత నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను వేరే నియోజకవర్గానికి మారిస్తే ఫలితం ఎలా ఉంటుంది ఇలా అనేక అంశాలపై జగన్ సర్వే నివేదికలను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం .దీనికి అనుగుణంగా సమూల ప్రక్షాళన చేపట్టి 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎటువంటి డోకా లేకుండా చేసుకునే విషయంపై జగన్ దృష్టి సారించినట్లు సమాచారం.