“జగనన్న గోరుముద్ద” పథకానికి ఇస్కాన్ అక్షయ ఫౌండేషన్ భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఒకచోటే సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి జిల్లాలో అన్ని పాఠశాలలకు ఒకే రకం నాణ్యమైన భోజనాలు అందించే విధంగా ఈ కిచెన్ నీ నిర్మించడం జరిగింది.రెండు గంటల్లో 50 వేల మందికి భోజనాలు అందించే రీతిలో ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక వంటశాలనీ సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా విద్యార్థులకు అన్నం వడ్డించారు.అదే సమయంలో భోజన పదార్థాలను స్వయంగా జగన్ రుచి చూడటం జరిగింది.విద్యార్థులకు చక్కనైన పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేస్తున్నామని ఇస్కాన్ ప్రతినిధులు ముఖ్య మంత్రికి తెలిపారు.ఇక ఇదే సమయంలో ఇస్కాన్ ఫౌండేషన్ నిర్మిస్తున్న కొన్ని కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొనడం జరిగింది. జగన్ ముఖ్య మంత్రి అయిన నాటి నుండి రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు సంబంధించి చదువు ఇంకా అనేక విషయాలలో ప్రోత్సాహకరంగా పథకాల రూపంలో ఆదుకుంటూ వస్తున్నారు.
“అమ్మఒడి” ద్వారా విద్యార్థుల చదువు భారం తల్లిదండ్రులు పై పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు.ఇంకా అదే సమయంలో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ప్రభుత్వమే అందించే రీతిలో.కూడా జగనన్న గోరు ముద్ద పథకం అమలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారు.
ఇంకా స్కూల్ బెల్ట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందించే విధంగా.విద్యార్థుల భవిష్యత్తు స్కూల్ దశనుండే.ఉద్యోగం పొందుతున్న రైతుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం.ఇంకా అనేక విప్లవాత్మక నిర్ణయాలు ముఖ్యమంత్రిగా జగన్ తీసుకోవటం జరిగింది.
ఈ తరుణంలో ఓకే చోట నుండి విద్యార్థులకు.మంచి పౌష్టికాహారం అందేలా ఇస్కాన్ అక్షయ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ నీ జగన్ ప్రారంభించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.