సంచలన నిర్ణయం దిశగా జగన్ ??

జగన్( CM Jagan ) తెలుగుదేశం జనసేన పొత్తుల దాదాపు కన్ఫర్మ్ అయిపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.సీట్లు ఓట్లు అంటూ లెక్కలు అప్పుడే మొదలైపోయాయి ఏ నియోజకవర్గానికి ఏ పార్టీకి టికెట్ కేటాయింపులు జరుగుతాయో తద్వారా ఏ పార్టీలో ఉండాలని ఎమ్మెల్యే అభ్యర్థులు అప్పుడే ఫార్ములాలు రెడీ చేసుకుంటున్నారు.

 Cm Jagan Sensational Decision On Early Elections In Ap Details,cm Jagan, Sensati-TeluguStop.com

ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు మరింత ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా తమకు నష్టం కలుగుతుంది అన్న భావనలో ఉన్న జగన్ ముందస్తు ఎన్నికలు( Early Elections ) దిశగా ఆలోచన చేస్తున్నారని జూన్ 7వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఆ దిశగా ప్రకటన చేయబోతున్నారంటూ కొన్ని వార్తా కథనాలుప్రసారం అవుతున్నాయి .

ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి జగన్ అనుమతి పొందారని ,గత నెలలో మూడు రోజులు తన పర్యటనలో భవిష్యత్ రాజకీయాల పట్ల కూలంకషంగా భాజపై పెద్దలతో చర్చించి వారి నుంచి విశ్వసనీయమైన హామీ కూడా పొందారని విశ్లేషణలు వెలబడుతున్నాయి.ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొని వేగంగా పరిణామాలను మారుస్తున్న తెలుగుదేశం ( TDP ) వ్యవహారాలను జగన్ ఒక కంట కనిపెడుతున్నారని,

Telugu Ap, Chandrababu, Cm Jagan, Janasena, Pawan Kalyan, Sensational-Telugu Pol

మరోవైపు జనసేన కూడా వారాహి యాత్రను ప్రకటించడం వల్ల రాష్ట్రంలో పరిణామాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారబోతున్నాయన్న సర్వే రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని జగన్ ముందస్తుకుతెర తీయబోతున్నారని ,ఆగస్టు నుంచి అక్టోబర్ లోపు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దుచేసి అవకాశం ఉందని, తన సంక్షేమ పథకాల ఫలితాలనే తన పెట్టుబడిగా పెట్టి ప్రజల్లోకి వెళ్లి మరొకసారి ప్రజల ఆశీర్వాదాన్ని కోరాలనే ఆలోచనలు జగన్ ఉన్నారని ఈ విశ్లేషణల సారాంశం.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Janasena, Pawan Kalyan, Sensational-Telugu Pol

ఇప్పటికే ముందస్తు దిశగా అనేక అంచనాలు వెలువడినప్పటికీ అవి ఏమి సఫలం కాలేదు అయితే ఈసారి మాత్రం వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నందున ఎన్నికల వరకు వేచి చూస్తే దొరణి పార్టీకి అంతా మంచి చేయదు అన్న ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.సర్వే రిపోర్ట్ లు కూడా మందస్తుకు వెళ్తేనే పార్టీకి మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో జగన్ ముందస్తు దిశగా ఆలోచిస్తున్నారని మరో రెండు రోజుల్లో ఈ దిశగా ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube