ఏపీలో కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ( Visakhapatnam ) బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ లో డ్రగ్స్ పట్టు పడటం సంచలనం సృష్టించింది.ఈ విషయంపై అధికార విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) నేటి నుంచి “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) పేరిట బస్సు యాత్ర నిర్వహించటం జరిగింది.కడప జిల్లాలో మొదలైన ఈ యాత్రకి జనాలు నీరాజనాలు పలికారు.
ఈ క్రమంలో సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ బ్రెజిల్ నుంచి విశాఖకు చంద్రబాబు( Chandrababu ) వదిన చుట్టం డ్రగ్స్ ను విశాఖకు తీసుకొస్తే సీబీఐ పట్టుకుందన్నారు.ఆ దాడులు జరిగిన వెంటనే ఎల్లో బ్రదర్స్ భయపడిపోయి మన మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.తీర చూస్తే పట్టుబడింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షరాలు చంద్రబాబు నాయుడు వదిన గారి కొడుకు వియ్యంకుడు.
ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు.చంద్రబాబు బంధువులు ఆత్మబంధువులు.ఆ కంపెనీకి…చంద్రబాబు ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టిన వాళ్లతో వీళ్ళకి దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి.అయితే నేరం చేసింది వాలైతే మన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటు విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.