CM Jagan: చిన్నారి దీర్ఘకాలిక వ్యాధిపై స్పందించిన సిఎం జగన్..

హమీద బిడ్డ మొహమ్మద్ అలి తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.వ్యాధి గురించి తెలిసి వెంటనే చలించిపోయి.

 Cm Jagan Reacted To The Childs Chronic Illness Details, Cm Jagan, Childs Chronic-TeluguStop.com

మొహమ్మద్ అలికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ని ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించి రూ.1,00,000 చెక్కు, నెలవారీ 3000 రూపాయల పింఛను మంజూరు చేసిన కలెక్టర్ గిరీష పి ఎస్.రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపిన హమీద.బుధవారం మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నుండి 4వ దశ జగనన్న విద్యా దీవెన లబ్దిని ప్రారంభించిన సందర్భంగా, వేదిక వద్ద హమీద బిడ్డ మొహమ్మద్ అలికి దీర్ఘకాలిక వ్యాధి ఉన్న విషయం దృష్టికి వచ్చి ముఖ్యమంత్రి తన దయార్ద హృదయాన్ని చూపారు.

హమీద అనే మహిళ తన బిడ్డ మహ్మద్ అలీ అనే చిన్నారిని ఎత్తుకుని బుధవారం టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభకు తీసుకురావడం జరిగింది.

తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స చేయించడానికి ఆర్ధిక స్థోమత సరిపోక ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.వివరాలు ఆరా తీసిన పిదప విషయం అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వెంటనే ఆమెకు ఆర్ధిక పరంగా సహాయం అందచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గిరీష పి ఎస్ వెంటనే స్పందించి కార్యక్రమ అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లో రూ.1,00,000 మొత్తానికి చెక్కును ఆమెకు అందించారు.అలాగే నెలవారీ 3000 రూపాయల పింఛను అందజేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.అలాగే స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube