విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో సీఎం జగన్‌ కీలక సమావేశం..

అమరావతి: విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక సమావేశం.విద్యారంగంలో కీలక మార్పులపై సాలోచనలు.

బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి.ఏఐ, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటేషన్‌ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి.

ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్ధులను తయారుచేయడంపై ప్రత్యేక దృష్టి.పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు సీఎం అడుగులు.

సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్.వైస్‌ ఛాన్సలర్లను, రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖలకు సంబంధించిన అధికారులను పిలిపించాం.

Advertisement

విద్యారంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.మనం ఒక స్థాయిలో ఉంటే.

లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది.ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే.

ఏం చేయాలన్నదానిపై ఆలోచనలను పంచుకోవడానికి మీ అందర్నీ ఒక చోటకు పిలిచాను.ఉన్నత విద్యా రంగంలో వైస్‌ఛాన్సలర్లది కీలక పాత్ర.

అందుకే మిమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం.టెక్నాలజీ పరంగా చూస్తే.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

మొదటి రివల్యూషన్‌ 1784లో స్టీమ్‌తో రైలు ఇంజన్‌ రూపంలో చూశాం.తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్‌ రూపంలో మరొక రివల్యూన్‌ చూశాం.

Advertisement

మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు, ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం.ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం.

రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోంది.ఈ అడుగులో మనం వెనుకబడితే.

కేవలం అనుసరించే వాళ్లగానే మనం మిగులుతాం.సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే.

మనం ఈరంగాల్లో నాయకులం అవుతాం.ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.

దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్‌ చేసేవారు.మరొక వర్గంగా తయారవుతారు.

గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్‌ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం.మనం ఏదీ క్రియేట్‌ చేసే పరిస్థితిలో లేం.అందుకనే ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది.ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం.

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో మనం క్రియేటర్లుగా తయారు కావాలి.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని ఒకవైపు మన విద్యావిధానంలోకి తీసుకువచ్చి.

విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.రెండోవైపున ఏఐ క్రియట్‌ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలి.

ఇది కూడా కరిక్యులమ్‌లో భాగం కావాల్సిన అవసరముంది.మొన్ననే జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌ నన్ను కలిశారు.

జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఉందని చెప్పారు.పాశ్చాత్య ప్రపంచం అంతా డెమొగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ ఎదుర్కొంటోంది.

మనదేశంలో కాని, మన రాష్ట్రంలోకాని సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు.వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్‌ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం.

ఇది వాస్తవం.అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి.

ఏ రకమైన మార్పులకు శ్రీకారం చుడితే.మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలి.

నలుగురితో నేను మాట్లాడి.నాకు అనిపించిన ఆలోచనలన్నింటినీ కూడా వీసీల ముందు ఉంచుతున్నాను.

ఈ ఆలోచనలు కార్యాచరణలోకి రావాలి, వీటికి రూపకల్పన జరగాలి.ఇందులో మీ పాత్ర గరిష్టంగా ఉండాలి.

ఈ రోజు మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం.ఈ తొలి అడుగు మన ఆలోచనలను చైతన్యం చేయడం ద్వారా విద్యారంగాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

ప్రపంచస్థాయిలో మన పిల్లలను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం.ఇవాళ మనం చదివిస్తున్న, చదువుకుంటున్న చదువులు నిజంగానే.

ప్రపంచస్థాయిలో నాయకులుగా నిలబడగలిగే స్థాయిలో ఉన్నాయా? లేకపోతే.ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది.

పిల్లలకు చదువులు చెప్తే విధానాలను పరిశీలిస్తే.మనం కొన్ని సబ్జెక్టులను నిర్దేశిస్తున్నాం.

ఒకసారి వెస్ట్రన్‌ కరిక్యులమ్‌ చూస్తే.వెస్ట్రన్‌ వరల్డ్‌లో.

ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే.చాలా వర్టికల్స్‌ కనిపిస్తాయి.

ఒక బీకాంలోనే అసెట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్సియల్‌ మార్కెట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అనాలసిస్‌ ఇలాంటి వర్టికల్స్‌ ఎన్నో ఉన్నాయి.మన దగ్గర లేవు.

మంచి డిగ్రీ రావాలంటే విదేశాలకు పోవాల్సిందే.మనం కూడా చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలి.

వారు కావాల్సిన వర్టికల్స్‌ చదువుకునే అవకాశాలను ఇవ్వాలి.మనం డిగ్రీలకు సంబంధించి తాజాగా క్రెడిట్స్‌ఇస్తున్నాం.

కాని, వాటి స్థాయిని కూడా పెంచాల్సి ఉంది.పిల్లలకు కావాల్సిన కోర్సుల్లో బోధన అందించాల్సిన అవసరం ఉంది.

ఆ రకంగా చేయడానికి ప్రతి ఫ్యాకల్టీలో మనం క్రియేట్‌ చేయగలగాలి.దీనిపై ప్రతి వీసీ కూడా ఆలోచన చేయాలి.

ఇవేకాకుండా రకరకాల అంశాల్లో అడుగులు పడాల్సి ఉంది.మనం ఇచ్చే డిగ్రీలకు సంబంధించి కూడా మార్పులు రావాల్సి ఉంది.

ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం.ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా వినియోగించుకోవాలి.సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్‌ కోర్సులకు సంబంధించి బోధన చేసే స్థాయిలో మనం ఉన్నామా? లేదా? అన్నదికూడా చూడాలి.ఒకవేళ లేకపోతే.

అలాంటి కోర్సులు కావాలనుకునే విద్యార్థులకు బోధనను నిలిపేస్తామా? అంటే నిలిపివేయలేం.వర్చువల్‌ రియాలిటీని తీసుకునివచ్చి ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీతో కలుపుతాం.

ఎప్పుడైతే ఈ రెండూ కలిసాయో.వర్చువల్‌ క్లాస్‌ టీచర్‌ విద్యార్ధులకు పాఠాలు చెబుతారు.

ఆ మేరకు తరగతుల నిర్వహణ ఉండాలి.మెడికల్‌ కోర్సుల బోధనలో కూడా మార్పులు గణనీయంగా రావాల్సి ఉంది.5 ఏళ్ల మెడికల్‌ కోర్సు రాబోయే రోజుల్లో ఇవాళ సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా కూడా మార్పులు రావాలి.శరీరాన్ని కోసి ఆపరేషన్‌ చేసే రోజులు పోయాయి.

కేవలం కొన్ని హోల్స్‌ చేసి.కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడకుని ఆపరేషన్‌ చేసే స్థాయి వచ్చింది.

అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలి.హర్యానాలోని ఒక మెడికల్‌ కాలేజీలో కూడా దీనికి సంబంధించిన కోర్సులనుకూడా పెట్టారు.

కేవలం మెడిసిన్‌లో చికిత్సకు సంబంధించిన జ్ఞానం ఇవ్వడమేకాదు, టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్న దానిపై పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి.ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్‌ టెక్నాలజీని అవగాహన చేసుకోవాలి.

దాన్ని కరిక్యులమ్‌లో ఇంటిగ్రేట్‌ చేసుకోవాలి.దాన్ని వినయోగించుకోవడం, ఆ రంగాల్లో బోధనను మెరుగుపరచడం చేయాలి.

ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన కంటెంట్‌ అందుబాటులో ఉంది.అందులో వర్చువల్‌ రియాల్టీ, అగమెంటెడ్‌ రియాల్టీని కరిక్యులమ్‌లోకి తీసుకునిరావాలి.

వ్యవసాయం చేసే తీరుకూడా గణనీయంగా మారిపోతోంది.మన రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఆర్బీకేలను తీసుకుని రావడం ద్వారా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.

గణనీయ మార్పులు తీసుకు వచ్చాం.గ్రామ స్ధాయిలో చేయిపట్టుకునినడిపే వ్యవస్ధను తీసుకొచ్చాం.

ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకూడదు.ప్రతి రైతును, ప్రతి ఎకరాలో సాగును కూడా చేయిపట్టుకుని నడిపించుకునే స్థాయికి వెళ్లాలి.

ప్రతి ఎకరాలో భూసార పరీక్ష చేస్తాం.శాటిలైట్‌ ఇమేజ్‌ ద్వారా భూమిలో ఉన్న కాంపోజిషన్‌ చెప్పే పరిస్థితి ఉంది.

డ్రోన్లు ద్వారా భూసారం ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది.ఈ రిపోర్ట్‌ ద్వారా ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకునిరావచ్చు.

దీనిద్వారా ఆ పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో ఇట్టే తెలిసిపోతుంది.ఈ టెక్నాలజీని మనం పిల్లలకు నేర్పకపోతే.

మనం వెనకబడతాం.ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్‌ గాని చూస్తే.

వీళ్ల పాఠ్యపుస్తకాలు, వీళ్ల బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం.చాలా విభిన్నంగా ఉంటుంది.

మనకు, వీరికీ తేడా ఎందుకు ఉంటుంది? అన్నదానిపై ఆలోచన చేయాలి.మన పిల్లలకు మంచి సబ్జెక్ట్‌ జ్ఞానం ఉండొచ్చు.

కాని, వెస్ట్రన్‌ దేశాల మాదిరిగానే అక్కడ రూపొందించే ప్రశ్నలకు సమాధానాలు నింపే పరిస్థితుల్లో ఉన్నారా? అన్నది చూడాలి.ప్రశ్నా పత్నం విధానం మారాలి.

వెస్ట్రన్‌ వరల్డ్‌ ఎలా బోధిస్తుందన్నది మన కరిక్యులమ్‌లోకి రావాలి.ఇవేమీ చేయకపోతే మనం వెనకబడి ఉంటాం.

అక్కడ టెక్ట్స్‌బుక్స్‌ కూడా పిల్లలకు ఇచ్చి.సమాధానాలు రాయించి.

ప్రాక్టికల్‌ అప్లికబిలిటీ ఉందా? లేదా? అని చూస్తారు.మనం ప్రాక్టికల్‌ అప్లికబులిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ను తీసుకునిరావడం లేదు.

అందుకే ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి.ఇవన్నీకూడా అత్యంత కీలకమైన అంశాలు.

ఇవన్నీ చేయాల్సిన మార్పులు.ఇవి చేయకపోతే వెనుకబడతాం.

ఇవన్నీ చేయాలంటే.ఎలా చేయాలి? ఎలా చేయగలుగుతాం? అన్నది ఆలోచన చేయాలి.ఒక్కో యూనివర్శిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్‌ తయారు చేయలేదు.

ఒక్కో మాదిరిగా ఉండలేదు.మనం చేస్తున్న విజన్‌ కోసం ఒక హైలెవల్‌ అకడమిక్‌ బోర్డు మనకు అవసరం.

ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం.ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లకు.

పైన చెప్పిన అంశాలన్నింటినీ ఇంటిగ్రేట్‌ చేస్తూ.ఈ మార్పులతో కరిక్యులమ్‌ను రీడిజైన్‌ చేద్దాం.

పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం.వర్చువల్‌ రియాలిటీ, ఏఐ టెక్నాలజీని పాఠ్యప్రణాళికలో భాగం చేద్దాం.

బోధనలో కూడా వాడుకుందాం.ఇవన్నీ అత్యంత సమర్ధవంతంగా ఎలా చేయాలన్నదానిపై ఆలోచన చేయడానికే బోర్డు ఏర్పాటు చేద్దాం.

కేవలం ఉన్నత విద్యాస్థాయిలోనే మార్పులు చేస్తే ఫలితాలు రావు.ప్రాథమిక విద్యాస్థాయి నుంచే ఈ మార్పులు రావాలి.

ఆ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడ్డాయి.స్కూళ్లను ఇప్పటికే ఇంగ్లిషు మీడియంలోకి మార్పు చేశాం.బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం.6 వ తరగతి ఆ పైనున్న తరగతులను డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌లా మార్చాం.తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం.

డిసెంబరు నాటికి 6వ తరగతి ఆపై తరగతులకు చెందిన 63వేల క్లాస్‌రూమ్స్‌ను ఐఎఫ్‌పి ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్‌ చేస్తున్నాం.ఇప్పటికే 31వేల తరగతి గదులకు ప్యానెల్స్‌ ఏర్పాటు చేశాం.బైజూస్‌ కంటెంట్‌ను ఇంటిగ్రేట్‌ చేశాం.8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చాం.దీనికి తదుపరిగా తీసుకు రావాల్సిన మార్పులు తీసుకురావాలి.

వీఆర్, ఏఆర్, ఏఐలని టెక్నాలజీని వాడుకుని వారికి మంచి బోధన, నేర్చుకునే సమర్థతను పెంచాలి.ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్రియేటర్లుగా కూడా తొలిఅడుగులు అక్కడ పడాలి.

అందుకే పాఠశాల విద్య స్థాయిలో ఒక బోర్డును, హయ్యర్‌ఎడ్యుకేషన్‌ లెవల్లో మరొక బోర్డును ఏర్పాటు చేయాలి.ఈ రెండింటిని ఇంటిగ్రేట్‌ చేయాలి.

పౌండేషన్‌ లెవల్‌ నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరకు తీసుకుంటున్న చర్యలను సినర్జీ చేయాలి.నా ఆలోచనలను తదుపరిస్థాయికి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో పలు విధానాలు ఇప్పటికే వచ్చేశాయి.కాని వాటి ఫ్యాకల్టీలో మనం వెనకబడి ఉన్నాం.

కంటెంట్‌ ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంది.దాన్ని ఎలా వాడుకోవాలి అన్నదానిపై మనం ఆలోచన ఉండాలి.

శిక్షణ ఇచ్చుకుంటూ పోతే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధం అవుతారు.ఆ రకంగా దీన్ని అధిగమించాలి.

దీనిపై మరిన్ని సాలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలి.మెడికల్, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్యప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి.

మన కలను సాకారం చేసుకోవాలి.

తాజా వార్తలు